
బ్యాంకు లింకేజీలో జిల్లాకు ఉత్తమ అవార్డు
పాతమంచిర్యాల: బ్యాంకు లింకేజీలో జిల్లాకు ఉత్తమ అవార్డు లభించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.464 కోట్లు గ్రామైక్య మహిళా సంఘాలకు రుణంగా అందించినందుకు జిల్లా రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలి చింది. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్‌కుమార్, సీఈవో దివ్య చేతుల మీ దుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్, అ దనపు డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీపీఎం స్వర్ణలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అనిత అవా ర్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అధి కారులు అవార్డులు అందుకోవడంపై జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందుకున్న అధికా రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏపీఎం శ్యామల, సీసీ సత్యనారాయణ, సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారు.