
మానవత్వం చాటిన డీసీపీ
జన్నారం: విధి నిర్వహణలో జన్నారం వెళ్తున్న డీసీపీ భాస్కర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి పంపించి మానవత్వాన్ని చా టుకున్నారు. జన్నారం పోలీస్టేషన్‌లో బైక్ దొంగల అరెస్ట్‌పై విలేకరుల సమావేశానికి బుఽ దవారం వస్తుండగా, జన్నారం సమీపంలోని జింకల పార్కు వద్ద ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి పడిపోయారు. వారిని ఎవరూ ఆస్పత్రికి తరలించడం లేదు. గమనించిన డీసీపీ భాస్కర్ తన వాహనం ఆపి వారి వ ద్దకు వెళ్లి పరిశీలించారు. దారి వెంట వచ్చే ఆ టోను ఆపి తన సిబ్బందితో క్షతగాత్రులు మంచిర్యాలకు చెందిన మాచర్ల వెంకటేశ్, మాచర్ల బాబురావును ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. జన్నారం పోలీస్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ను వారి వెంట పంపించారు.