
ఘనంగా రాజీవ్‌గాంధీ వర్ధంతి
పాతమంచిర్యాల: మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 33వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టులో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్‌రావు మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశంలోని యువతకు ప్రోత్సాహం అందించడానికి ఐటీ పరిశ్రమ అబివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఓపెన్ యూనివర్సిటీలు నెలకొల్పారని, 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించారని, గ్రామీణాభివృద్ధి కోసం ప్రణాళికలు రచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఇంచార్జి రాజేశం, జైపూర్ మండల కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, టైబల్ సేవాదల్ ఇంచార్జి కోవ జంగు, శ్రీరాంపూర్ సేవాదల్ నాయకులు యాకూబ్‌రెడ్డి, నాయకులు మార్కండేయ, చంద్రమౌళి పాల్గొన్నారు.