
పుష్కర ఘాట్లపై మట్టికుప్పలు
● బాసరలో భక్తులకు తప్పని అవస్థలు
బాసర: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర గో దావరిన ది పుష్కరఘాట్ల వద్ద పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి పుష్కర ఘాట్ నుంచి రెండో పుష్కరఘాట్ వరకు గోదావరి నీటి ప్రవాహం తగ్గడంతో పుష్కరఘాట్లపై నల్లమట్టి పెద్దపెద్ద కుప్పలుగా పే రుకుపోయింది. బాసర సరస్వతీ అమ్మవారి సన్ని ధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దక్షిణాది రా ష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ముందుగా పవిత్ర గోదావరినదిలో పుణ్య స్నానం ఆచరించడం పుణ్యఫలంగా భావిస్తారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనంతో గోదావరి ఘాట్ తీరమంతా అస్తవ్యస్తంగా మారింది. బురద, చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. బాసర ప్రధాన స్నానఘాట్ పైభాగంలో గంగమ్మ విగ్రహం, ఘాట్ కిందిభా గం మెట్ల వద్ద శివలింగం ఉంది. ఇక్కడ అనేక ఏళ్లుగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల పారిశుద్ధ్య నిర్వహణ గాలి కొదిలేయడంతో శివలింగం కళ తప్పుతోంది. ఎంట్రన్స్‌లోనే పుష్కర ఘాట్లు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి.
కలుషిత నీటిలోనే స్నానాలు
మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్‌లో పుట్టిన గోదారమ్మ బాసర వద్ద చదువులమపాదాలను తాకి తెలుగురాష్ట్రాల్లోకి అడుగిడుతుంది. ఎగువన భారీ వర్షాలు కురిసినపుడు వచ్చే వరదలతో ఘాట్లు పరిశుభ్రమవుతున్నాయే తప్ప అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. గత పుష్కరాల సమయంలో రూ.10 కోట్లు వెచ్చించి నిర్మించిన ఘాట్లు అధ్వానంగా మారిపోయాయి. ఫలితంగా పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. అంతేకాకుండా గోదావరినదిలో నీళ్లు కూడా కలుషితం అయ్యాయి. ఆలయ అధి కారులు భక్తుల సౌకర్యార్థం షవర్స్ ఏర్పాటు చేసినా కొంతమంది భక్తులు కలుషిత నీటిలోనే స్నా నాలు చేస్తున్నారు. ఇప్పటికై నా దేవాదాయశాఖ అధి కారులు స్పందించి పుష్కరఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు.

పుష్కర ఘాట్లపై మట్టికుప్పలు