
‘ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు సరికాదు’
జైపూర్: జైపూర్ మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతిపై మాదిగ హక్కుల దండోరా నాయకులు చేసిన అసత్యపు, నిరాధారమైన ఆరోపణలు ఖండిస్తున్నామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి సతీశ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై కక్షపూరితంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ తిరుపతి, సభ్యులు రవిచందర్, శ్రీనివాస్, ప్రశాంత్, సత్యనారాయణ, సురేశ్, ఉదేయ్‌కుమార్, స్వామి, అపర్ణదేవి, రజిత, విజయ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.