
టోల్ ట్యాక్స్ నిలిపివేయాలని ధర్నా
చెన్నూర్‌రూరల్: కిష్టంపేట సమీపంలోని వైజంక్షన్ వద్ద టోల్ ట్యాక్స్ నిలిపి వేయాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో టోల్‌గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ట్యాక్స్ పేరుతో దోపిడీకి గురిచేస్తున్నారన్నారు. అటవీశాఖలో ఎక్కడా ఈ టాక్స్‌లు వసూలు చేయడం లేదన్నారు. కాళేశ్వరంలో పుష్కరాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ట్యాక్స్ వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్‌గౌడ్, బుర్ర రాజశేఖర్‌గౌడ్, తుమ్మ శ్రీపాల్, తదితరులు పాల్గొన్నారు.