
వ్యాక్సిన్ వేసుకోవాలి
మంచిర్యాలటౌన్: వ్యాక్సిన్‌ను సమయానుసారంగా వేసుకోవాలని, తప్పిపోయిన వ్యాక్సిన్లను వేసేందుకు ఈ నెల 21 నుంచి 28వరకు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ అనిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాల అర్బన్ హెల్త్‌సెంటర్‌లో క్యాచ్ అప్ టీకాల రెండో విడత కార్యక్రమాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు, చిన్నారులు వేసుకునే వ్యాక్సిన్లలో ఏవైనా త ప్పిపోయి ఉంటే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. సరైన సమయంలో టీకాలు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.