ఎన్నికల బరిలో 14 యూనియన్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో 14 యూనియన్లు

Oct 8 2023 1:28 AM | Updated on Oct 8 2023 1:28 AM

● సింగరేణిలో ముగిసిన నామినేషన్ల పర్వం

శ్రీరాంపూర్‌: సింగరేణిలో 7వ దఫా జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా శుక్ర, శనివారాల్లో నామినేషన్లు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డెప్యూటీ సీఎల్సీ సమక్షంలో యూనియన్‌ నాయకులు నామినేషన్లు సమర్పించారు. శనివారం సాయంత్రానికి నామినేషన్ల ప్రక్రియ ముగియగా, ఈ నెల 9న ఉప సంహరణ ఉంది. నామినేషన్‌ వేసిన సంఘాలన్నీ పోటీలో ఉండడం సింగరేణి ఎన్నికల్లో సర్వసాధారణం

సంఘాలివే..

సింగరేణి ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు వేసిన సంఘాల వివరాలివి. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ), తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌), సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌(ఐఎన్టీయూసీ), సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌), సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇంజనీర్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎమ్మెస్‌), సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(సీఐటీయూ), సింగరేణి కాలరీస్‌ లేబర్‌ యూనియ న్‌(టీఎన్టీయూసీ), గోదావరి లోయబొగ్గు గని కార్మి క సంఘం(ఐఎఫ్‌టీయూ), సింగరే ణి గని కార్మిక సంఘం, ప్రజా తెలంగాణ సింగరేణి కార్మిక సంఘం(టీఎన్టీయూసీ), శ్రామిక శక్తి గోదా వరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం(ఏఐఎఫ్‌టీ యూ), తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ రీజినల్‌ సింగరేణి కార్మిక సంఘం, సింగరేణి డ్రైవర్స్‌ ఈపీ ఆపరేటర్స్‌ అండ్‌ అండర్‌గ్రౌండ్‌ ఆల్‌ట్రేడ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ నామినేషన్లు వేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement