ఊట్కూర్: క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, మానసిక ఉల్లాసం, శారీరక ఎదుగుదల వస్తుందని డీవైఎస్‌ఓ వెంకటేశ్ శెట్టి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆదివారం ఎస్‌జీఎఫ్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14, 17, 19 విభాగాల్లో రెజ్లింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పోటీల్లో గెలుపొందిన వారు కాన్‌కుర్తిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుక భరత్, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్సిములు, కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, పీడీ సాయినాథ్, పర్దె మునీర్ అహ్మద్, పారిజాత, జగదీశ్‌గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భార్య హత్య కేసులో
నిందితుడి అరెస్టు
ధరూరు: భార్యను రోకలిబండతో మోది హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వె ళ్తే.. ధరూరు మండల పరిధిలోని ఓబులోనిపల్లి గ్రామానికి చెందిన గోపి తన భార్య జమ్ముల మ్మను శనివారం రోకలిబండతో మోది హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం పరారీలో ఉన్న గోపిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు రేవులపల్లి పోలీసులు తెలిపారు.


