శరణబీ తేనెతో మాకు కొంత ఉపాధి, ఆదాయ వనరు ఉంటుందని అనుకుంటున్నాము. బీ మిత్ర, మేము వంతుల వారీగా తేనెటీగల పోషణ, మచ్చిక చేసుకుంటున్నాము. రెండు మూడు రోజులకు ఒకసారి షెడ్డులోని బాక్సుల్లో ఉన్న తేనెటీగలను పరిశీలించడంతోపాటు పరిస్థితులను బట్టి వాటికి కావాల్సిన ఆహారం ఇస్తాం. ఒక్కో బాక్స్‌లో సుమారు నాలుగు తేనె తెట్టెలు పెట్టే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. సుమారు రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో బాక్సుల్లో తేనె తయారవుతుంది. అడవిలో తేనె దొరకకపోవడంతో ప్రస్తుతం ఈ తేనెటీగల పెంపకం ద్వారా మా కుటుంబాలకు కొంత ఉపాధి కలుగుతుందని భావించి పోషణ చర్యలు తీసుకుంటున్నాం. – మౌనిక, మల్లాపూర్ పెంట


