సెర్ప్ సంస్థ వారు మాతో రూ.2 వేలు కట్టించుకుని షెడ్లు, బాక్సులు ఏర్పాటు చేయడం బాగానే ఉంది. అయితే ఆ ఏర్పాట్ల కోసం ప్రతి కుటుంబానికి రూ.62 వేల అప్పు అంటున్నారు. ఇప్పటికే ‘దారా బయ్యన్న మహిళా సంఘం’ ద్వారా బ్యాంకులో అప్పు తీసుకుని తిరిగి చెల్లించే క్రమంలో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి సంబంధించిన రెండు, మూడు బాక్సుల తేనెటీగలు అడవిలోకి వెళ్లిపోయాయి. తేనె వచ్చేది ఎంత, దానితో మాకు ఎంత లాభం వస్తుందో తెలియడం లేదు. అప్పు మీద పడకుండా అధికారులకే చర్యలు తీసుకోవాలి. – చిగుర్ల బయ్యన్న, మల్లాపూర్ పెంట
●


