మన భవిష్యత్‌ను నిర్ణయించేవి రాజకీయాలే.. | - | Sakshi
Sakshi News home page

మన భవిష్యత్‌ను నిర్ణయించేవి రాజకీయాలే..

Oct 4 2026 10:19 AM | Updated on Oct 4 2026 10:19 AM

ఆత్మకూర్‌: విద్యార్థులు బాగా చదివి ఉద్యోగాలు సాధించడంతోపాటు రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ రాజ్యాధికారపార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్‌ మల్లన్న అన్నారు. పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కార్పోరేట్‌ విద్యను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మన భవిష్యత్‌ను నిర్ణయించే శక్తి రాజకీయాలకే ఉందని, యువత సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ప్రభుత్వ పనితీరును ఎత్తి చూపాలని, హామీల అమలు విషయంలో నిలదీయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల సలహాలు, సూచనలు అందించి డిక్షనరీలను అందజేశారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్‌ సైదులు, అధ్యాపకులు విశ్వేశ్వర్‌, కురుమూర్తి, సునీల్‌కుమార్‌ మల్లన్నను షాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement