విష జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

విష జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులు

Sep 17 2026 1:50 AM | Updated on Sep 17 2026 1:50 AM

విష జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులు ఆందోళనకు సిద్దమవుతాం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

కంపెనీల నుంచి వచ్చే పొగ, వాసన మూలంగా మా గ్రామంలోని వృద్ధులకు, చిన్నపిల్లలకు విష జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి. చాలామంది దగ్గు, ఆస్తామ వంటి వ్యాధులకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి.

– మాలింగప్ప, రైతు, చేగుంట

మండలంలోని పలు గ్రా మాల ప్రజలు ఈ కంపెనీ ల మూలంగా ఇబ్బందుల కు గురవుతున్నారు. అఖిలపక్షాల ఆధ్వర్యంలో త్వరలోనే అన్ని గ్రామాల ప్రజలతో ఆందోళనలు చేపట్టబోతున్నాం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తాం. న్యాయం జరగకపోతే ఉద్యమం చేపడుతాం.

– బస్‌లింగప్ప, యువకుడు, చేగుంట

మండలంలోని గుడెబల్లూర్‌, వాసునగర్‌, చేగుంట, ఐనాపూర్‌ తదితర గ్రామాల ప్రజలతోపాటు కర్ణాటకలోని కెమికల్‌ ఫ్యాక్టరీల మూలంగా దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. తమకు ఆయా గ్రామాల ప్రజలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

– శ్రీనివాస్‌, తహసీల్దార్‌, కృష్ణా మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement