కెమికల్‌ కంపెనీలతో కాలుష్యం | - | Sakshi
Sakshi News home page

కెమికల్‌ కంపెనీలతో కాలుష్యం

Sep 17 2026 1:50 AM | Updated on Sep 17 2026 1:50 AM

కృష్ణా: మండల సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో వెలిసిన కెమికల్‌ ఫ్యాక్టరీల మూలంగా ప్రతినిత్యం దుర్వాసనతో పలు గ్రామాల ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతోపాటు ఆ ఫ్యాక్టరీల్లో నిల్వ ఉంచుతున్న వ్యర్థాల మూలంగా ముక్కులు పగిలిపోయే విధంగా దుర్వాసన వస్తుండడంతో ప్రజలు ఆ వాసన భరించలేకున్నారు. ప్రతిరోజు సాయంత్రం అయిందంటే చాలు చల్లగాలికి వచ్చే వాసనకు తట్టుకోలేక పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాగే మండలంలోని స్నేహ చికెన్‌, ఇథనా ల్‌ ఫ్యాక్టరీల నుంచి కూడా భరించలేని దుర్వాసన వస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

● కర్ణాటకలోని కడెచూర్‌ శివారులో ఏర్పాటు చేసిన కెమికల్‌ ఫ్యాక్టరీల వ్యర్థాలను ప్రతినిత్యం అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్‌ ద్వారా తెలంగాణ సరిహద్దులోని గ్రామాలకు అతి సమీపంలో ఉన్న కాల్వకు వదులుతుండడంతో మన ప్రాంతానికి భరించలేని దుర్వాసన వస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ విషపూరిత పదార్థాల మూలంగా భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో గ్రౌండ్‌ వాటర్‌ కలుషితం అవడంతోపాటు భూసారం కూడా దెబ్బతిని, పంటలు పండించలేని దుస్థితి ఏర్పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.

పది గ్రామాలకు ఇబ్బంది

రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పదుల సంఖ్యలో కెమికల్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. దాంతోపాటు తెలంగాణ, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వ్యర్థాలను కూడా ఇక్కడకు తీసుకొచ్చి వాటిని భూమిలోకి వదులుతున్నారు. మన రాష్ట్రంలోని చేగుంట, ఐనాపూర్‌, కున్సీ, ఆలంపల్లి, మాగనూర్‌ మండలంలోని కొత్తపల్లి, మాగనూర్‌, గుర్రావ్‌లింగంపల్లి, కర్ణాటకలోని బాడియాల్‌, సైదాపూర్‌, గూడూర్తోపాటు మరో పది గ్రామాలకు ఈ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వాసనకు ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారు. అఖండ సినిమాలో మాదిరిగ హైదరాబాద్‌, బెంగళూర్‌ సుదూర ప్రాంతాల్లోని కంపెనీలు వదిలే అ భయంకరమైన వ్యర్థాలను ఇక్కడకు తీసుకొచ్చి డంపు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ విధంగా డంపు చేసిన వ్యర్థాలు భూమిలో కలిసిపోయి గ్రౌండ్‌ వాటర్‌ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. ఏదీఏమైనా ఈ ఫ్యాక్టరీల మూలంగా వల్ల తమ భూములకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ విషయంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

పరిశ్రమల వల్ల ప్రజలకు అనారోగ్యం

సాయంత్రం అయిందంటే

ముక్కుపుటాలదిరే దుర్వాసన

వాసన భరించలేక తలెత్తుతున్న

శ్వాసకోశ ఇబ్బందులు

కర్ణాటక సరిహద్దులోని కంపెనీలు

వదులుతున్న కాలుష్యమే కారణం

ఎక్కడెక్కడినుంచో కెమికల్‌ వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్న వైనం

అటు కర్ణాటకలోని గ్రామాలతోపాటు తెలంగాణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement