ఆనందలక్ష్మి మృతి వార్తతో డీఎంఆర్‌ఎం పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమెకు నివాళి గా పాఠశాలకు సెలవు ప్రకటించారు. తమకు ఎంతో ఆప్యాయంగా బోధించిన టీచర్ ఇక లేరన్న విషయం తెలియక కొందరు విద్యార్థులు ‘మా టీచర్ ఎక్కడా?’ అంటూ ఆమె మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఆనందలక్ష్మి భర్త రాము కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె నర్వ మండలం బెక్కర్‌పల్లి, అమరచింత మండలం పాంరెడ్డిపల్లిలో సుమారు తొమ్మిదేళ్లు సేవలందించారు. ప్రస్తుతం అమరచింతలోని డీఎంఆర్‌ఎం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానం అందుకున్న ఆనందం 24 గంటలు గడవకముందే విషాదంగా మారడం స్థానికులను కలచివేసింది.


