మన్యంకొండలో ముగిసిన శ్రావణ మాస వేడుకలు | - | Sakshi
Sakshi News home page

మన్యంకొండలో ముగిసిన శ్రావణ మాస వేడుకలు

Sep 17 2026 1:50 AM | Updated on Sep 17 2026 1:50 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా 35 రోజులుగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రావణమాసం ప్రారంభం నుంచి ప్రతిరోజూ స్వామివారికి నిత్యపూజలు, ప్రత్యేక అలంకరణలు, అఖండ భజనలు, హోమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన వేడుకలకు బుధవారం సమారాధనతో ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజుతో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement