వేరుశనగ సాగు.. జాగ్రత్తలతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

వేరుశనగ సాగు.. జాగ్రత్తలతో లాభాలు

Sep 17 2026 1:50 AM | Updated on Sep 17 2026 1:50 AM

మిడ్జిల్‌: రాష్ట్రంలో అధికంగా సాగు చేసే పంటలలో వేరుశనగ ఒకటి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధిక శాతం సాగు చేస్తుంటారు. అ యితే వేరుశెనగలో అధిక దిగుబడులు సాధించాల ంటే అధికారుల సూచనలు తప్పకండా పాటించా లని మండల వ్యవసాయ అధికారి సిద్దార్థ తెలిపారు.

నేలల ఎంపిక–తయారీ..

వేరుశనగ పంటకు ఎర్ర ఇసుక నేలలు, నీరు ఇంకే తేలికపాటి నేలలు అనుకూలం. దుక్కిని 2–3 సార్లు బాగా దున్ని చివరి దుక్కిలో ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దుక్కిలోతు 20సెం.మీటర్ల వరకు ఉండేలా చూసుకోవాలి.

విత్తనాల ఎంపిక..

విత్తనాల ఎంపికలోనే రైతులు ఎక్కువగా మోసపోతుంటారు. మార్కెట్‌లో దొరికే ప్రతి విత్తనం మంచిది కాదు.

● కె–6 (కదిరి): 100–110 రోజులలో పంట చేతికి వచ్చి దిగుబడి ఎకరానికి 12–14 క్వింటాళ్లు వస్తుంది.

● కదిరి–9: కరువును తట్టుకుంటుంది. నూనే శాతం ఎక్కువ. 110 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి 10–12 క్వింటాళ్లు.

● కదిరి హరితాంధ్ర: పంట కాలం వంద రోజులు. ఎకరానికి 10 –12 క్వింటాల దిగుబడి వస్తుంది. బెట్ట పరిస్థితులను, ఆకుపచ్చ, తామర తెగులును తట్టుకుంటుంది.

● ధరణి: పంట కాలం 100 – 105 రోజులు. దిగుబడి 9–10 క్వింటాళ్లు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.

● టిఏజి–24 రకం: పంట కాలం 95 – 100 రోజులు. దిగుబడి 8–10 క్వింటాళ్లు.

● జెఎల్‌–24 రకం: పంట కాలం 105 – 110 రోజు లు దిగుబడి 10–12 క్వింటాళ్లు. గింజలు పద్దెగా ఉంటాయి. ఒకే సారి కాయలు గట్టి పడుతాయి.

విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి

విత్తనం బరువుగా నిండుగా ఉండాలి. పుచ్చిన పగిలిన గింజలను తీసివేయాలి.

గింజపై పొట్టు ఎరుపు మెరుస్తూ ఉండాలి. గతేడాది పొలంలో పండిన దాన్నే వాడుతుంటే 9 నెలలు లోపు విత్తనం అయి ఉండాలి. పాత విత్తనం మొలక శాతం తగ్గుతుంది.

ఎరువుల యాజమాన్యం..

వేరుశనగ పంటకు ఎక్కువ యూరియా అవసరం లేదు. ఎకరానికి డీఏపీ 60 కిలోలు, ఎంఓపి 30 కిలోలు, జిప్సం 200 కిలోలు వేసుకోవాలి. జిప్సం చాలా ముఖ్యం. పూత దశలో (విత్తిన 35–40 రోజులకు) జిప్సం వేయడం వలన కాయలో గింజ బీటగా నిండుతుంది. పొల్ల కాయలు రావు. సూక్ష్మదాతువులు, బోరాన్‌ లోపం వలన కాయలు లోపల గింజ నల్లబడుతుంది. దీనికి 0.5 శాతం బోరాన్‌ ను పూత సమయంలో పిచికారీ చేయాలి.

చీడ పురుగుల సమగ్ర నివారణ..

● పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగలి పురుగు నివారణకు వేపనూనేను పిచికారీ చేసుకోవాలి.

● వేరు పురుగు–సి ఆకారంలో ఉండి భూమి లోపల వేర్లను కత్తిరిస్తుంది. ఈపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. నివారణకు క్లోరిపైరిఫాస్‌ ఫోరేట్‌ 10 శాతం గుళికలు, ఎకరానికి 6 కిలోల చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి.

● ఆకు ముడత పురుగు: ఈపురుగు విత్తిన 15 రోజుల నుంచి ఆశిస్తుంది. ఆకులపైన గోధుమ రంగుమచ్చలు ఉంటాయి. ఈ పురుగు 2–3 ఆకులను కలిపి గూడు చేసి పచ్చదనాన్ని తినడం వలన ఆకులన్నీ ఎండి కాలిపోయినట్లు కనబడుతాయి. నివారణకు క్లోరిఫైరిపాస్‌, 500 మి.లీటర్లు లేదా ఎసిఫేట్‌ 300 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

● శనగపచ్చ పురుగు: ఈ పురుగులు లేత ఆకులపైన మొగ్గలు, పువ్వులపై చేరి రంధ్రాలను ఏర్పరుస్తాయి. నివారణకు ఎకరానికి 4–5 లింగాకర్చక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక కిలో బి.టి ఫార్కులేషన్‌ లేదా 5శాతం వేపనూనె పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement