జాతీయ సెమినార్‌కు రావాలని మంత్రికి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

జాతీయ సెమినార్‌కు రావాలని మంత్రికి ఆహ్వానం

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

కోడ్‌తంత్ర ప్రత్యేక శిక్షణ..

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ ఆధ్వర్యంలో ఈనెల 7, 8వ తేదీల్లో హైదరాబాద్‌ సమీపంలోని కన్హాశాంతి వనంలో నిర్వహించే జాతీయ సెమినార్‌కు హాజరుకావాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు పీయూ వీసీ శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ‘వికసిత్‌ భారత్‌ –2047లో భాగంగా విద్యా, ఆరోగ్యం, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ సెమినార్‌లో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆయనతోపాటు ప్రణాళికా మండలి వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డికి కూడా ఆహ్వాన పత్రాన్ని అందించారు.

యూనివర్సిటీలోనే నిర్వహించాలి..

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించే జాతీయ సెమినార్‌ను అధికారులు యూనివర్సిటీలోనే నిర్వహించాలని కోరుతూ ఎంఎస్‌ఎఫ్‌, బీఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం రిజిస్ట్రార్‌ రమేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలోనే నిర్వహించాలని గత కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని, సెమినార్‌ ఇక్కడ నిర్వహించకపోతే జరగబోయే తదుపరి పరిణామణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఏర్పాటు చేసిన కోడ్‌ తంత్ర టెక్నికల్‌, సాఫ్ట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సోమవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కోడ్‌ తంత్ర సంస్థ ప్రతినిధి కల్యాణ్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు పేరు నమోదు చేసుకోవాలని, పలు అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ శిక్షణతో విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, రవికుమార్‌, సిద్ధరామగౌడ్‌, సుజాత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement