రోడ్డు ప్రమాదంలో ఏపీ యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఏపీ యువకుడి దుర్మరణం

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

● మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన కారు?

గద్వాల క్రైం: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా మల్లాది గ్రామానికి చెందిన సునీల్‌(24) మూడు నెలల క్రితం పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా చేరాడు. సోమవారం తెల్లవారు జామున సొంతూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు బైక్‌పై వెళ్తుండగా వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రధాన గేట్‌ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో సునీల్‌ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి రామరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. అయి తే ప్రమాదానికి కారకుడైన వ్యక్తి గద్వా లకు చెందిన సత్యారెడ్డిగా గు ర్తించినట్లు సమాచారం.

మద్యం మత్తే కారణమా?

మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపు తూ అతి వేగంతో బైక్‌ ను ఢీకొట్టినట్లు స్థాని కులు పేర్కొంటున్నారు.ప్రమాదానికి కారకుడైన వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు.బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కారు ని లపకుండా తప్పించుకున్నారని వివరించారు.

సైబర్‌ మోసం..

రూ.4.60 లక్షలు మాయం

గద్వాల క్రైం: ఆన్‌లైన్‌ షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి రూ. 4.60 లక్షలు సైబర్‌ నేరస్తులు కాజేసిన ఘటన ఆల్యసంగా వెలుగులోకి వచ్చింది. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో వివిధ కంపెనీలకు చెందిన షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ప్రకటన చూశాడు. నిజమని నమ్మి సదరు కంపెనీలకు మెయిల్‌, వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ను 10 రోజుల క్రితం రిజిస్టర్‌ చేశాడు. అదేరోజు గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడికి ఫోన్‌ చేసి లాభాలపై తెలియజేశారు. ముందుగా రూ. 20 వేలు పెట్టుబడులు చేశాడు. అయితే ఎక్కువ లాభాల కోసం కొంత నగదును పెట్టుబడులు చేయాల్సిందిగా చెప్పడంతో పలుమార్లు నగదును సదరు కంపెనీలకు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాడు. ఇలా మొత్తం రూ.4.60 లక్షలు పంపించాడు. అయితే బాధితుడు పెట్టిన డబ్బులకు ఎలాంటి ఆదాయం వ్యక్తిగత ఖాతాలో జమకాలేదు. దీంతో అనుమానం వచ్చి సంబంధిత వ్యక్తులను ఆరా తీయగా.. మరికొంత నగదు డిపాజిట్‌ చేస్తే ఖాతాలో నగదు బదీలి అవుతుందన్నారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గద్వాల జిల్లా సైబర్‌ పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై సైబర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

చేపలవేటకు వెళ్లిన

దంపతులు..

భర్త గల్లంతు

కొల్లాపూర్‌ రూరల్‌: కొల్లాపూర్‌ మండలం అమరగిరి పంచాయతీ పరిధిలో ఉన్న చెంచుగూడెనికి చెందిన ఆదివాసి కాంట్రాస్‌ బాల య్య (35) తన భార్య నర్సమ్మతో కలిసి కృష్ణానదిలోకి చేపల వేటకు వెళ్లి ప్రమాదవ శాత్తు గలంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గూడెంవాసుల కథనం ప్రకారం.. గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానది బ్యాక్‌ వాటర్‌లోకి బోటు వేసుకొని ఈనెల 25న సాయంత్రం కాంట్రాస్‌ బాలయ్య, తన భార్య నర్సమ్మతో కలిసి చేపల వేటకు వెళ్లారు. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత కోతిగుండు ప్రాంతంలో చేపలు వేటాడుతున్న సమయంలో పెద్దగాలి వచ్చింది. గాలికి బోటులో ఉన్న బాల య్య ప్రమాదశాత్తు నదిలో జారిపడ్డాడు. భార్య నర్సమ్మ రక్షించడానికి ప్రయత్నించి విఫలమైయింది. అదే బోటులో రాత్రి గడ్డకు వచ్చి గూడెంలో ఉన్నవారికి సమాచారం ఇచ్చింది. కొంతమంది వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నెల 26 ఆదివారం భార్య నర్సమ్మ కొల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తు చేపట్టి ఆదివాసిల సహా యంతో మరోసారి గాలింపు చేపట్టారు. సోమ వారం వరకు ఆచూకీ లభించలేదని ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు. గల్లంతైన బాలయ్యకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement