ఆదాయం రూ. 90.86 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఆదాయం రూ. 90.86 లక్షలు

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

● అలంపూర్‌ ఆలయాల్లో హుండీ లెక్కింపు

అలంపూర్‌: అలంపూర్‌ క్షేత్రంలో వెల సిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వా మి ఆలయాల్లో హుండీ లెక్కింపు సో మవారం జరిగింది. హుండీల ద్వారా రూ.90.86 లక్షల ఆదాయం వచ్చిన ట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. కురుమూర్తి ఆలయ ఈఓ మదనేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు చేపట్టారు. జోగుళాంబ అమ్మవారి ఆలయాల హుండీ ద్వారా రూ.76,55,496, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం హుండీ ద్వారా రూ.13,54,585 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆలయాల నిత్యాన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.76,850 వీటితోపాటు యూఎస్‌ డాలర్స్‌– 247, యూఏఈ 10 దినామ్స్‌, మలేషియా రింగిట్‌– 1, నేపాల్‌ రూపాయి–1 వచ్చినట్లు తెలిపారు. అదే విధంగా 27 గ్రాముల మిశ్రమ బంగారం, 152 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు పేర్కొన్నారు. హుడీ లెక్కింపులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

నిందితుడి రిమాండ్‌

నవాబుపేట: బాలికను ప్రేమపేరుతో వేధించిన ఘటన లో ఇటీవల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటనపై అప్పట్లో బాధితుల ఫిర్యాదుతో ఈ ఘట నకు కారణమైన వ్యక్తి ని తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా గతంలో బాలికను ప్రేమపేరుతో వేధిస్తుండే వాడని ఈ విషయంలో పలుమార్లు కుటుంబ సభ్యులు హెచ్చరించిన పద్ధతి మార్చుకోలేదని బాధిత కుటుంబం పోలీసులకు వివరించింది. ఈ విషయంలో 10రోజుల క్రి తం బాలిక ఇంట్లో ఎవరు లేని సమ యంలో ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో ఈ ఘటనకు బాధ్యుడైన కోస్గి సత్తయ్యను సోమవా రం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ న రేందర్‌ తెలిపారు. కా గా న్యాయస్థానం ముందు హాజరుపర్చగా అతడికి న్యాయస్థానం 14రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement