బల్మూర్: ఇంటి తాళాలు పగలగొట్టిన బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం బల్మూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మాదవరం అరుణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 28న ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లాడు. తిరిగి ఆదివారం ఇంటికి చేరుకోగా.. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉన్న వివిధ రకాల బంగారు నగలు మూడున్నర తులాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తప్పిన పెను ప్రమాదం
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు రాజీవ్‌నగర్ కాలనీలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా హైఓల్టేజీ సరఫరా కావడంతో యాదయ్య అనే వ్యక్తి ఇంట్లో టీవి చూస్తుండగా కాలిపోయి మంటలు చెలరేగాయి. టీవి కింద పెట్టిన కుర్చీ కూడా మంటల్లో కాలిపోయింది. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో కాలనీలోని మరికొన్ని ఇళ్లల్లో ఫ్యాన్లు, టీవి కాలిపోయాయి. విషయం తెలుసుకున్న లైన్‌మెన్ భాస్కర్‌రెడ్డి లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ వార్డు కౌన్సిలర్ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదకారణాలను అడిగి తెలుసుకున్నారు. హైఓల్టేజీ సరఫరా కారణంగానే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు.
ఆస్తి కోసం తండ్రిపై
కుమారుడి దాడి
నవాబుపేట:ఆస్తి కోసం కన్నతండ్రిపై కుమారుడు దాడి చేసి న ఘటన మండల పరిధిలోని కొండాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పోకల కృష్ణయ్యపై అతని పెద్ద కుమారుడు లక్ష్మణ్‌కుమార్ శనివారం ఇంట్లో దాడి చేసి తీవ్రంగా గా యపరిచాడు. ఈ క్రమంలో బాధితుడు కృష్ణ య్య ఆదివారం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ జనార్దన్ తెలిపారు. బాధితుడు మాట్లాడుతూ.. తన ఇద్దరు కుమారులకు ఆస్తిని సమానంగా ఇచ్చానని, కా నీ పెద్ద కుమారుడు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఇంకా తన దగ్గర ఉన్న భూమి, డబ్బులు కావాలంటూ తరుచూ దాడి చేస్తూ చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు.


