126 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

126 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ

May 30 2026 3:02 AM | Updated on May 30 2026 3:02 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా పంచాయతీ శాఖ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో ఇన్‌చార్జి డీపీఓ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ బదిలీల ప్రక్రియను చేపట్టారు. మొత్తం 126 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీలు నిర్వహించారు. ఇందులో స్పౌజ్‌ కింద 35 మంది, 3 మెడికల్‌, ఒక్కరు విడో, 87 మంది సాధారణ బదిలీ అయ్యారు. వీరితో పాటు నలుగురు కార్యాలయం సిబ్బంది, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్ల బదిలీలు నిర్వహించారు. వీరు జూన్‌ 1వ తేదీన ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘాల నాయకుల సమక్షంలో బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. నిబద్ధతతో విధులు నిర్వహించాలని, అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేదుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీపీఓ కార్యాలయం ఏఓ అనంతరావు, శ్రీనివాస్‌, సరిత, అలివేలు, నవీద్‌, దీపిక పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement