రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

మహమ్మదాబాద్‌: నంచర్లగేట్‌లో డిజీల్‌ తీసుకుని తిరిగి మహమ్మదాబాద్‌ వస్తుండగా.. మార్గమధ్యంలో మొకర్లాబాద్‌ ముందలితండా సమీపంలో బైకు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఓయువకుడు దుర్మరణం చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘనట చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కంచన్‌పల్లికి చెందిన బూరెల శ్రీను(26), ర్యాకం మల్లేష్‌ కలిసి నంచర్లగేట్‌లోని పెట్రోల్‌బంక్‌లో డీజిల్‌ పోయించుకుని వస్తుస్తున్నారు. మొకర్లాబాద్‌ ముందలితండా సమీపంలో బైకు అదుపు తప్పి పక్కనే రోడ్డుకు దగ్గర్లో ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొన్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందగా.. మల్లేశ్‌ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీను మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు. మల్లేష్‌ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా మృతుడికి ఏడాది కిందట వివాహం కావడంతో చిన్న కూతురు, భార్య ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement