జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి 27,803 బస్తాల ధాన్యం, మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. ఇందులో 17,082 బస్తాల వరి ధాన్యం రాగా.. ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,622, కనిష్టంగా రూ.1,605 ధరలు లభించాయి. అలాగే 9,782 బస్తాల మొక్కజొన్న రాగా క్వింటా గరిష్టంగా రూ.1,955, కనిష్టంగా, 1,606 లభించింది. వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,371, కనిష్టంగా రూ.4,089, ఆముదాలు గరిష్టంగా రూ.6,277, కనిష్టంగా రూ.5,669, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,478, కనిష్టంగా రూ.6,458, రాగులు గరిష్టంగా రూ.3,370, కనిష్టంగా రూ.3,250 చొప్పున వచ్చాయి.
● బాదేపల్లి యార్డుకు సోమవారం భారీగా దిగుబడులు రావడం వల్ల బస్తాలను లోడింగ్ చేయని కారణంగా స్థలాభావం ఏర్పడిందని యార్డు కార్యదర్శి అశ్వక్ అహ్మద్ తెలిపారు. దీంతో మంగళవారం యార్డులో క్రయవిక్రయాలు నిలిపి వేస్తున్నట్లు చెప్పారు.
ఆర్‌ఎన్‌ఆర్ ధర రూ. 2409
దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,409, కనిష్టంగా రూ.2,009 ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,709, కనిష్టంగా రూ.1,700 చొప్పున వచ్చాయి. మార్కెట్‌కు దాదాపు వెయ్యి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


