మహబూబ్‌నగర్ క్రీడలు: యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని మేయర్ మమత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో మెయిన్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ‘యూత్, స్పోర్ట్స్ వీక్ 5కేఎం మారథాన్ రన్‌ను మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రన్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిరోజు కనీసం ఒక గంటపాటు వ్యాయామం, వాకింగ్ వంటి పనులను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమలో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని చాటుకొని తద్వారా సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ కరుణశ్రీ, ఎంఈఓ కృష్ణ య్య, నెహ్రూయువ కేంద్రం కోఆర్డినేటర్ కోటానాయక్, ఉమ్మడిజిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కా ర్యదర్శి కురుమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


