కోడేరు: మండల పరిధిలో ని గుండ్యవాల్యనాయక్ తండాలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాట్రావత్ లోకారం నాయక్ (39) ఆదివారం పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటారు ఆన్ చేసే క్రమంలో తెగిపడిన విద్యుత్ వైరును గమనించకుండా తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపారు.
వాహనం ఢీకొని
వ్యక్తి దుర్మరణం
కోస్గి రూరల్: గుర్తు తెలి యని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘ ట న మండల పరిధిలో శనివారం రాత్రి చోటుచేసు కుంది. పోలిసుల కథనం మేరకు తోగాపూర్ గ్రామానికి చెందిన నారాయణకు (33) వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన తోక దస్తమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివా హం జరిగింది. వీరు హైదరాబాద్‌లో కూలీ ప ని చేసుకుంటూ జీవనం సాగించేవారు. గత నె ల 30 న దాల్తాబాద్ గ్రామంలోని తమ పొలంలో బోరు వేయించేందుకు వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిత్రుడు వెంకటేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై తోగాపూర్ నుంచి దౌ ల్తాబాద్‌కు వెళ్తుండగా కొత్తపల్లి గ్రామ శివారులో మూత్రవిసర్జన నిమిత్తం వెంకటేష్ కిందకు దిగ గా బైక్‌పై ఉన్న నారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయా లై అతను చనిపోయాడు. మృతుని భా ర్య దస్త మ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
జడ్చర్ల: మండల పరిధిలోని పెద్ద ఆదిరాలకు చెందిన నలుగురు ఆదివారం బొలేరో వాహనంలో శ్రీశైలంలో స్వామి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు మూడు రోజులుగా గ్రామంలో భక్త శిరియాళ నాటక ప్రదర్శన చేసిన పాత్రదారులు ఆదివారం స్వామి వారి దర్శనానికి శ్రీశైలం బయలు దేరారు. మార్గమధ్యలో కల్వకుర్తి దాటిన తరువాత కొండారెడ్డి పల్లి గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన డోజర్ వీరి వాహనా న్ని ఢీకొట్టడంతో ఇమ్మడి వెంకటయ్య (43) అక్కడికక్కడే మరణించగా కుమ్మరి యాదగిరి, కుమ్మరి సుబ్రహ్మణ్యం, కృష్ణయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మాగనూర్: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. మందిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిత్యం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. అయితే నిందితుడు పోలీసులను గమనించి ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పారిపోవడంతో ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించామన్నారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
చేపల వేటకు
వెళ్లి వ్యక్తి మృతి
నవాబుపేట: మండల పరిధిలోని కాకర్లపహడ్ గ్రామ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు(41) స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. అనంతరం చెరువులోకి దిగి వలను సతీస్తున్న క్రమంలో అతని కాళ్లకు వల చుట్టుకొని చెరువులో మునిగిపోయాడు. చెరువు కట్టపై ఉన్న అతని స్నేహితులు గ్రామస్తులను తీసుకుని వచ్చే లోపు మృతి చెందాడు. మృతుడికి భార్య అంజమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ట్రాక్టర్, బైక్ ఢీ..
ఒకరు మృతి
కొల్లాపూర్ రూరల్: పెద్దకొత్తపల్లి మండల పరిఽధిలోని కొత్తపేట గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో తెలుగు ఆంజనేయులు (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కొల్లాపూర్ మండల కుడికిల్ల గ్రామానికి చెందిన తెలుగు ఆంజనేయులు బైక్‌పై ఆదివారం రాత్రి కొత్తపేట దగ్గర ఉన్న మామిడి తోటకు బయలుదేరాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను గమనించకపోవడంతో బైక్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆంజనేయులు కిందపడి మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


