నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్ నగరానికి నేడు(బుధవారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా బీజేపీ పాలమూరు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బూత్ స్థాయి కార్యకర్తల దగ్గరి నుంచి జిల్లా నాయకులు భారీగా తరలిరావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అన్ని శాఖలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిపి దాదాపు 25వేల మందితో ఈ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు కార్యకర్తలు సమావేశ స్థలం దగ్గరకు చేరుకోవాలని, మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
● మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్‌చార్జి చింతల రామచంద్రరెడ్డి పరిశీలించారు. సమావేశం నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు.


