బండమీదిపల్లికి వీడిన గ్రహణం
● తొలిసారి ఎన్నికల
నిర్వహణకు
అధికారుల
ఏర్పాట్లు
● 2018లో
గ్రామపంచాయతీగా
ఆవిర్భవించినా పోలింగ్
జరగని వైనం
జడ్చర్ల టౌన్: మండలంలోని బండమీదిపల్లి గ్రామపంచాయతీకి తొలిసారి మూడోవిడతలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2018లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడినప్పటికీ జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్నందున 2019లో ఎన్నికలు జరగలేదు. 2020, డిసెంబర్‌తో జడ్చర్ల గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగిసి పురపాలికగా మారింది. దీంతో అనుబంధ గ్రామంగా ఉన్న బండమీదిపల్లి పంచాయతీగా ఏర్పడినప్పటికి ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించలేదు. 2020, డిసెంబర్ 20 నుంచి గ్రామపంచాయతీ పాలన ప్రారంభమై పంచాయతీ కార్యదర్శిని నియమించి ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. ఇన్నాళ్లకు ఎన్నికలు జరుగుతుండటంతో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేవు. ఈ గ్రామంలో 820 జనాభా, 498 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బీసీ జనరల్‌కు కేటాయించారు. సర్పంచ్‌తో పాటు 8 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
‘గ్రామపాలన’పై పాఠం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యార్థులకు గ్రామ పాలనపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో విధులు, విధానాలు, బాధ్యతలను వివరిస్తూ పాఠ్యాంశం రూపొందించింది. ఆరోతరగతి సాంఘికశాస్త్రం పార్ట్–2 పాఠ్య పుస్తకంలో 13వ పాఠ్యాంశంగా ‘గ్రామపంచాయతీలు’ శీర్షికన ఏడు పేజీల్లో ముద్రించారు. గ్రామస్తులకు సౌకర్యాల కల్పన, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం, గ్రామసభ, ఓటరు జాబితా, వార్డులు, రిజర్వేషన్లు, ఎన్నికలు, నిధులు, మండల పరిషత్, జిల్లా పరిషత్ తదితర వివరాలను ఈ పాఠ్యాంశంలో క్షుణ్ణంగా వివరించారు. ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు ఈ పాఠం చదివితే పూర్తి అవగాహన కలుగుతుందని పలువురు చెబుతున్నారు.
బండమీదిపల్లికి వీడిన గ్రహణం


