రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని జిల్లా సాఫ్ట్‌బాల్ అ సోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్‌రాజు అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మహిళా సాఫ్ట్‌బాల్ జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అమరేందర్‌రాజు మాట్లాడుతూ జిల్లా సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ జగిత్యాలలో ఈ నెల 7 నుంచి 9 వరకు రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ మహిళల టోర్నమెంట్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జి.శరత్‌చంద్ర, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు రాఘవేందర్, నాగరాజు, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
– ఉమ్మడి జిల్లా మహిళా జట్టుకు ఎస్.సునీత, పి.మంజుల, భార్గవి, శిరీషా, తులసి, పి.కాంచన, కీర్తి, కె.నిఖిత, పి.నిఖిత, ఎం.వర్షిత, కె.పల్లవి, శివజ్యోతి (మహబూబ్‌నగర్), పి.రోషిని, జి.మనీషా, జె.మహేశ్వరి, శిరీషా రాణి (నారాయణపేట), స్టాండ్‌బైగా శ్వేత, ఎం.వర్షిత (మహబూబ్‌నగర్) ఎంపికయ్యారు.


