కేఎల్‌ఐ కాల్వలో మహిళ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌ఐ కాల్వలో మహిళ మృతదేహం లభ్యం

Nov 3 2025 7:12 AM | Updated on Nov 3 2025 7:12 AM

కేఎల్

కేఎల్‌ఐ కాల్వలో మహిళ మృతదేహం లభ్యం

బిజినేపల్లి: మండలంలోని కారుకొండ గ్రామ శివారులో ఉన్న కేఎల్‌ఐ కాల్వలో మంగనూర్‌ కు చెందిన కురువ సాయమ్మ (60) అనే మహి ళ మృతదేహం ఆదివారం లభ్యమయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగ నూర్‌ గ్రామానికి చెందిన సాయమ్మ ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులైనా ఆమె ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, గ్రామంలో తదితర ప్రాంతాల్లో వెతికారు. సా మాజిక మాద్యమాల్లో సాయమ్మ కన్పించడం లేదని పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో సాయ మ్మ మృతదేహం ఆదివారం ఉదయం కాల్వలో కనపడింది.స్థానికులు కుటుంబ సభ్యులకు విష యం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరు కుని మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

కోస్గి రూరల్‌: పెళ్లి జరిగి నెల రోజులు గడవక మందే ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు నాచారం గ్రామానికి చెందిన బోయిని భీమప్ప, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన బోయిని రాము (24) కు దోమ మండలంలోని దాదాపూర్‌కు చెందిన కంపిళ్ల వెంకటయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె అనితతో అక్టోబర్‌ 8న నాచారంలో వివాహమైంది. రాము హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఆటోను నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. వివాహం తర్వాత భార్య అనితను హై దరాబాద్‌ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి రాలేదు. ఆదివారం ఉదయం ఓ చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. పక్కనే ఆటో ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతిపై అనుమానం ఉండటంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి జరిగి నెల రోజులు గడవక మందే రాము అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబంలో విషాధం అలుముకున్నాయి.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

ఉండవెల్లి: మండలంలోని మెన్నిపాడుకు చెందిన శేఖర్‌(30)ను గత నెల 30న రాత్రి బైక్‌పై కర్నూలుకు వెళ్తుండగా జాతీయ రహదారిపై మోవాత్‌ దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో శేఖర్‌కు తలకు గాయం కావడంతో 108 అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు.

మృతిపై అనుమానం

మృతుడు శేఖర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలంగా దాడి చేయడంతో కోమాలో ఉన్నాడని 30వ తేదీన బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ప్రమాదం కాదని గాయాలపై అనుమానం ఉందని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో

బంగారం వ్యాపారి

ధరూరు: దొంగ బంగారం కొన్న కేసులో మండల కేంద్రంలోని వైఎస్సార్‌ చౌరస్తాలోని హేమంత్‌ బంగారు దుకాణ యజమాని శివకుమార్‌ను శాంతినగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎంత మేర బంగారం తాకట్టులో పెట్టుకున్నారు, ఎప్పుడు పెట్టారు, ఎంతకు తాకట్టు పెట్టుకున్నారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై రేవులపల్లి పోలీసులను వివరణ కోరగా అలాంటి దేమి తమ దృష్టికి రాలేదని, ఒకవేళ అదుపులోకి తీసుకొని ఉంటే వివారలు వెల్లడిస్తామని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. శాంతినగర్‌ పోలీసులు సదరు బంగారు వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన మహిళ

దోమలపెంట: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.వనపర్తికి చెందిన కురుమూర్తి (43)కి భా ర్య, పదో తరగతి చదివే కూతురు ఉండగా వా చ్‌మెన్‌గా పనిచేసున్నాడు. అయితే భార్య నాగమణి (38) శ్రీకాంత్‌ (26) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ఆనకట్ట దిగువన ఉన్న సాగర్‌ జలాశయంలో పడేసి వెళ్లిపోయారు. కురుమూర్తి కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వనపర్తి పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సాగర్‌ జలాశయంలో ఓ మృతదేహం తేలియాడుతున్నట్లు తెలియడంతో అమ్రాబాద్‌ సీఐ శంకర్‌నాయక్‌ సహకారంతో మృతదేహాన్ని బయటికి తీసి కుటుంబసభ్యులకు చూపించగా కురుమూర్తిదే అని గుర్తించారు. చివరికి భార్యనే ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు తేలడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కేఎల్‌ఐ కాల్వలో మహిళ మృతదేహం లభ్యం
1
1/1

కేఎల్‌ఐ కాల్వలో మహిళ మృతదేహం లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement