అలవి వలల జోరు
తీవ్రంగా నష్టపోతున్నాం..
ఏటా ఇతర రాష్ట్రాల నుంచి వందలాది మంది వచ్చి నిషేధిత వలలతో చిన్న, స న్న చేప పిల్లలను పట్టుకొని మాకు బతుకుదెరువు లే కుండా చేస్తున్నారు.పలు మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి నా ఫలితం లేదు. ఇప్పటికై నా స్పందించి నిషేధి త అలవి వలలతో చేపల వేటను నియంత్రించాలి.
– బాలరాజు, మంచాలకట్ట
ఉపాధి కోల్పోతున్నాం..
కృష్ణానదిలో అలవి వలలతో చేపల వేటను నిషేధిస్తే చిన్న, సన్న చేపపిల్లలు పెరిగి పరీవాహక ప్రాంతాల్లోని మత్స్యకారులు బతకడానికి ఉపాధి దొరుకుతుంది. అధికారులు దాడులు నిర్వహించి నియంత్రణకు చర్యలు చేపట్టాలి.
– రంగస్వామి, మల్లేశ్వరం
దాడులు నిర్వహిస్తాం..
అలవి వలలు నిషేధం కాబట్టి సిబ్బందితో కలిసి వెళ్లి కృష్ణానదిలో దాడులు నిర్వహిస్తాం. వలలు పట్టుకొనేందుకు ఫీల్డ్ మ్యాన్‌ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశాం. కచ్చితంగా వలలు పట్టుకొని కేసులు నమోదు చేస్తాం. జిల్లా మత్స్యశాఖ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అంతేగాకుండా స్థానిక మత్స్యకారులకు కూడా అవగాహన కల్పిస్తాం.
– రజని, జిల్లా మత్స్యశాఖ అధికారి
●
పెంట్లవెల్లి: ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. మరోపక్క దళారులు ఇతర రాష్ట్రాల కూలీలతో నిషేధిత అలవి, చైర్మన్ వలలతో కృష్ణానదిలో సన్న, చిన్న చేప పిల్లలు పడుతూ స్థానిక మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు. ఈ విషయాన్ని మండలంలోని కృష్ణా పరీవాహక గ్రామాల ప్రజలు పలుమార్లు జిల్లా మత్స్యశాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన చల్లపాడు, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి తదితర గ్రామాల మత్స్యకారులు ఏటా కృష్ణానదిని నమ్ముకొని చేపల వేట చేపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే పదేళ్లుగా ఇదే ప్రాంతాల్లో విజయవాడ, విశాఖపట్నం, కొవ్వూరు, రాజమండ్రి, తుని, కాకినాడ, ఝార్ఖండ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున దళారులు అక్కడి కూలీలను తీసుకొచ్చి అలవి వలలతో సన్న, చిన్న చేపపిల్లలు పట్టి వట్టిగా ఆరబెట్టి వ్యాపారం చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం చెరువులు, నదుల్లో బొచ్చ, రౌట, మట్ట, బొంబిడాలు వంటి రకరకాల చిన్న చేప పిల్లలను వదిలితే కనీసం అవి పెరిగి పెద్దవి కాకుండానే పడుతున్నారు. అలవి వలలు నిషేధితమని తెలిసి కూడా అధికారులు వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు. అదేవిధంగా మత్స్యకారులు కనీసం రోజు కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లడానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్న, సన్న చేప పిల్లలను వారే లాక్కెళుతుంటే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూసి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు.
కృష్ణానదిలో సన్న, చిన్న చేపపిల్లల వేట
ఉపాధి కోల్పోతున్న
స్థానిక మత్స్యకారులు
తూతూమంత్రంగా మత్స్యశాఖ
అధికారుల దాడులు


