‘వలస బతుకు’ ఓ గొప్ప పుస్తకం
మరికల్: వలస బతుకులపై నర్సన్న ఓ గొప్ప పుస్త కం రచించారని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. మరికల్‌కు చెందిన నర్సన్న తన కుటుంబంలో వలస వెళ్లిన వారిలో మూడోతరానికి చెందిన వ్యక్తి. ఆయన వలస వెళ్లిన సమయంలో తన అను భవాలను వివరిస్తూ శ్రీవలస బతుకుశ్రీ అనే పుస్తకం రాసి మరణించాడు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన కుమారుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట్రాములు పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథులుగా జిస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, ప్రొ. హరగోపాల్, విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 7వ తరగతి వరకు చదివిన నర్సన్న రచించిన పుస్తకాన్ని చదివేటప్పు డు తన మనస్సు కలిచివేసిందని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తమకని సూచించారు. చాలీచాలని కూలీతో జీవనం సాగిస్తూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా సొంత ఊరుకు రావడం అనే విషయం తనను చాలా బాధించిందన్నారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికీ వలసలు ఆగకపోవడం విచారకరమని తెలిపారు.
ఓ గొప్ప గ్రంథం..
వలస బతుకులను వివరిస్తూ నర్సన్న రాసిన పుస్త కం ఓ గొప్ప గ్రంథమని విశ్లేషకుడు పరకాల ప్రభా కర్ అన్నారు. తన అనుభవాలను ఉన్నది ఉన్నట్లుగా పుస్తకంగా రాయడం జీవితంలో ఎక్కడ చూడలేదని తెలిపారు. న్యాయమూర్తులు కూడా తెలుసుకోవాల్సి విషయాలు పుస్తకంలో ఉండటం విశేషమన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఈ పుస్తకాన్ని పాలమూరు అధ్యయన వేదిక వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా తాగునీరు దొరక్క ఓ రాత్రి మురుగు కాల్వలో నీటిని తాగమని రాసిన విషయం తను బాధించిందన్నారు. మనుషులను కదిలించే అంశాలు ఈ పుస్తకంలో ఉండటం విశేషమని.. నాటి నుంచి నేటి వరకు పాలమూరు జిల్లా వలస కూలీల బతుకులు మారకపోవడానికి పాలన విధానం సక్రమంగా లేకపోవడమే కారణమని తెలిపారు.
నర్సన్న ఓ కళాకారుడు..
పుస్తకం చదివిన తర్వాత నర్సన్నలో మరో కళాకారుడు దాగి ఉన్నాడని తెలుకున్నానని ఎమ్మెల్సీ, కళాకారుడు డా. గోరెటి వెంకన్న అన్నారు. బ్రాహ్మంగారి నాటకంలో నర్సన్న ఆలీరాాణి పాత్ర వేసి ఆ నాటకానికే వన్నే తెచ్చారని గుర్తుచేశారు. కనిపించని కళాకారులు తాము రచించిన పుస్తకాలు వెలుగులోకి రాకుండానే కనుమరుగయ్యారని తెలిపారు. నర్సన్న కుటుంబ సభ్యులు, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులను అభినందించడం గౌరవంగా ఉందన్నారు.


