కురుమూర్తిగిరులు.. కిటకిట
జాతర మైదానంలో రద్దీ
పాలమూరు ప్రజల ఆరాధ్య దైవం అమ్మాపురం కురుమూర్తిస్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు. అర్చకులు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో నిల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు గండదీపాలు మోసి పచ్చి పులుసు అన్నం నైవేద్యంగా సమర్పించారు. జాతర మైదానంలోని రంగుల రాట్నాలు, వాటర్‌బోట్లు, స్ప్రింగ్ జంపింగ్ వద్ద పిల్లలు, పెద్దలు సరదాగా గడిపారు. మిఠాయి దుకాణాలు, హోటళ్లు, ఆట వస్తువులు, గాజుల దుకాణాల్లో రద్దీ కనిపించింది. – చిన్నచింతకుంట
కురుమూర్తిగిరులు.. కిటకిట
కురుమూర్తిగిరులు.. కిటకిట


