‘బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత ముఖ్యమంత్రిదే..’
వీపనగండ్ల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్న జేఏసీకి సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించి ప్రక్రియ పూర్తి చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక తీరు, రాష్ట్రస్థాయిలో ఉన్న బీజేపీ నేతలు మరోతీరుగా వ్యవహరిస్తూ బీసీ కులాల్లో వర్గవిభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు తమపార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుందని.. బీసీ వర్గాలు చేసే ఉద్యమంలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి కిల్లె గోపాల్, వనపర్లి జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.
శతాబ్ధి ఉత్సవాలకు
తరలిరండి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ:దేశానికి స్వా తంత్య్రం కావాలని తొలుత 1925లోనే గర్జించింది తమ సీపీఐనే అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. ఆ దివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 26న ఖమ్మంలో జరిగే పార్టీ శతాబ్ది ముగింపు సభ, ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. పార్టీ త్యాగాలు, పోరాటాలను గుర్తు చేస్తూ ఈ నెల 15న బస్సుయాత్ర జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రారంభమై.. వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ఖమ్మం వెళ్తుందన్నారు. కొందరు వ్యక్తులు ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లును విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర ఎకై ్సజ్ శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకుని తక్షణమే దీనిని నిలువరించాలని, లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బాలకిషన్, కార్యవర్గ సభ్యులు పరమేష్‌గౌడ్, రాము, పద్మావతి, గోవర్ధన్, కౌన్సిల్ సభ్యులు నర్సింహ, శ్రీను, చాంద్‌బాషా పాల్గొన్నారు.


