గుట్టుగా వ్యభిచారం | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా వ్యభిచారం

Nov 3 2025 7:04 AM | Updated on Nov 3 2025 7:04 AM

గుట్టుగా వ్యభిచారం

గుట్టుగా వ్యభిచారం

రూ.వెయ్యి నుంచి 10 వేల వరకు..

నిఘా పెడుతాం..

ఫోన్‌లో సమాచారం..

మహబూబ్‌నగర్‌ క్రైం: ‘సందడిగా ఉండే ఇళ్లు.. రిచ్‌గా ఉండే కాలనీలు.. జన సంచారం అధికంగా ఉన్న చోట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉండదని భావిస్తాం.. కానీ, కొందరు వీటినే తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో పడుపు వృత్తి కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పడుతున్నాయి. వాట్సాప్‌ ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. సెల్‌ఫోన్‌లోనే బేరసారాలు చేస్తున్నారు. వేశ్యలు.. కొందరు గృహిణులకు సైతం ప్రలోభాలతో ఆశచూపి ఈ రంగంలోకి దించుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల పచ్చని కుటుంబాలు నాశనమవుతున్నాయి. జిల్లాకు సరిహద్దు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి విటులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం.

ప్రలోభాలకు గురిచేసి..

మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంతోపాటు జడ్చర్ల, భూత్పూర్‌ తదితర ప్రాంతాల్లో విస్తరిస్తున్న హైటెక్‌ వ్యభిచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జడ్చర్ల, భూత్పూర్‌ జాతీయ రహదారుల వెంట టోల్‌గేట్‌కు అర కిలోమీటర్‌ దూరం నుంచి రోడ్డుకు రెండు వైపులా ఈ తతంగం నడుస్తోంది. జాతీయ రహదారిపై ఉండే దాబాల్లోనూ ఈ దందా జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. ఆర్థిక స్థోమత లేక పడుపు వృత్తిలో దిగిన మహిళలు కొందరే ఉండగా.. మరికొందరు విలాసవంతమైన జీవితం కోసం ఈ వృత్తిలోకి వస్తున్నారు. వేశ్య వృత్తి చేసేవారు మంచి కుటుంబాలకు చెందిన మహిళలను సైతం ప్రలోభాలకు గురిచేసి ఈ రంగంలోకి దించుతుండటమే ఆందోళనకంగా మారింది. ప్రతిరోజు జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో ఇళ్లలో, ముఖ్యమైన హోటళ్లతోపాటు చిన్నపాటి లాడ్జిలలో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది.

వాట్సాప్‌లలో ఫొటోలు..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఈ దందా నిర్వహణ కోసం వాడుకుంటున్నారు. మంచి కుటుంబాలకు చెందిన మహిళలు సైతం ఈ రంగంలోకి దిగడంతో విటులను చూసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలిసిన వారుంటే పరువు పోతుందనే భయంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలస్తోంది. దీనికోసం చాలామంది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ముందుగా వాట్సాప్‌లో విటుని చిత్రాన్ని పంపించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందుకు పోతున్నారు. పైగా సెల్‌ఫోన్‌లో మాట్లాడే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుకొని తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లమనో.. లేక బయట ఫలానా చోట కలిస్తే మేం చూసి చెబుతామని చెప్పి సదరు మనిషిని చూశాకే తమకు తెలియని వ్యక్తి అని నిర్ధారణ చేసుకొని ముందుకు వెళ్తున్నారు.

కొందరు మహిళలు యువతులను సైతం ఈ వ్యాపారంలో దించుతున్నారు. హైదరాబాద్‌తోపాటు పల్లెల నుంచి వచ్చే కొందరు యువతులకు డబ్బు ఆశచూపెట్టి ఈ రంగంలోకి దించుతూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పరిచయస్తులైన యువతులకు సైతం గాలం వేస్తున్నారు. ఒక్కో విటుడి నుంచి రూ.వెయ్యి నుంచి మొదలుకొని రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఈ దందాలో మధ్యవర్తులే ఎక్కువగా లాభపడుతున్నారు. జిల్లాకేంద్రంలోని టూటౌన్‌, వన్‌టౌన్‌, రూరల్‌ ప్రాంత పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ వ్యభిచార కేంద్రాలు నడుస్తున్నా, పోలీసులకు సమాచారం ఉన్నా తేలిగ్గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాకేంద్రంలో

నివాస గృహాలే అడ్డాగా దందా

జాతీయ రహదారి

పొడవునా అదే తరహాలో..

టోల్‌గేట్‌ సమీప ప్రాంతంతోపాటు

ప్రత్యేక దాబాల్లోనూ వ్యవహారం

జిల్లాకేంద్రంతోపాటు జాతీయ రహదారిపై రాత్రివేళ ప్రత్యేక పెట్రోలింగ్‌ చేసి అసాంఘిక కార్యకలపాలపై నిఘా పెడతాం. పోలీస్‌స్టేషన్‌ వారీగా తనిఖీలు పెంచి అనుమానాస్పద ఇళ్లపై దృష్టిపెడుతాం. కాలనీల్లో ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక పనులు జరుగుతుంటే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

– వెంకటేశ్వర్లు,

డీఎస్పీ, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement