అడుగులోతు ప్రవాహం | - | Sakshi
Sakshi News home page

అడుగులోతు ప్రవాహం

Nov 3 2025 7:04 AM | Updated on Nov 3 2025 7:04 AM

అడుగు

అడుగులోతు ప్రవాహం

అడుగులోతు ప్రవాహం పాటుకాల్వ ఎత్తు పెంచాలి మందస్తు చర్యలు చేపట్టాం..

ఈ సీజన్‌లో గాండ్లోని చెరువు ఆరంభంలోనే నిండింది. భారీ వర్షం ఆగి నాలుగు రోజులైనా అండర్‌ పాస్‌ (ఆర్‌యూబీ) వద్ద వరద నీరు అడుగులోతు ప్రవహిస్తోంది. దీంతో నగరానికి వెళ్లడానికి ఈ మార్గం గుండా రాకపోకలు ఆగిపోయాయి. వర్షాలు కురిసినప్పుడల్లా కొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా ఈ చెరువులో పూడికతీసి రాజేంద్రనగర్‌, ప్రేమ్‌నగర్‌ వైపు ఉన్న తూములు తెరవాలి. అలాగే ఇక్కడి అండర్‌పాస్‌ వద్ద సీసీరోడ్డు నిర్మించి బెడ్‌వేసి కట్ట ఎత్తు పెంచాలి.

– వీరేష్‌, ఆటోడ్రైవర్‌, న్యూమోతీనగర్‌

ఎర్రకుంట తూము గతంలోనే తెరవడంతో పాటుకాల్వ ఇళ్ల మధ్యలో నుంచి వెళ్తుంది. దీని ఎత్తు పెంచి పటిష్టం చేయాలి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మా ఇంటి ఆవరణలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డాం. ఈ పాటుకాల్వ ద్వారా వరద ఇంకా పారుతోంది. మా కాలనీలో ఇటీవల రోడ్డు నిర్మించినా కాజ్‌వేకు ఇరువైపులా జాలి ఏర్పాటు చేయలేదు. ఇక్కడి సమస్యను అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదు.

– వెంకటేష్‌, వ్యాపారి, గణేష్‌నగర్‌

నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా సీజన్‌ ఆరంభంలోనే ముందస్తు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దచెరువు, ఎర్రకుంట, ఇమాంసాబ్‌ కుంటల తూములను తెరిచి ఎప్పటికప్పుడు వరద కిందికి వెళ్లేలా చేశాం. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో ఎక్కడా ఇళ్లలోకి వరద చేరలేదు. భారీ వర్షాలు కురిసినా ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్‌ అధికారుల సమన్వయంతో తరుచూ పర్యవేక్షిస్తున్నాం.

– విజయభాస్కర్‌రెడ్డి,

ఈఈ, పబ్లిక్‌ హెల్త్‌, మహబూబ్‌నగర్‌

అడుగులోతు ప్రవాహం 
1
1/2

అడుగులోతు ప్రవాహం

అడుగులోతు ప్రవాహం 
2
2/2

అడుగులోతు ప్రవాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement