కోయిల్‌సాగర్‌లో ఒక గేటు ఎత్తివేత
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం ఒక గేటును తెరిచి 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దవాగు నుంచి భారీగా వరద రావడంతో గత బుధవారం ఏకంగా అయిదు గేట్లను తెరిచి నీటిని విడుదల చేసిన తరువాత నాలుగు రోజులుగా ఒక గేటు తెరిచి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32.4 అడుగుల వద్ద పూర్తిస్థాయి నీటి నిల్వ 2.27 టీఎంసీలు ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు.


