బతికే ఉన్నాడా.. ఎటైనా పోయాడా?
ఎర్రవల్లి: మండల పరిధిలోని బీచుపల్లి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వనపర్తి జిల్లా కాశీంనగర్‌కు చెందిన ఎద్దుల వెంకటేష్ ఆచూకీ కోసం శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. రెండో రోజు రెండు స్పీడ్ బోట్ల సాయంతో ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది సాయంత్రం వరకు గాలించినా వ్యక్తి ఆచూకీ లభించలేదని ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన ఎద్దుల వెంకటేష్‌తో మరోక చరవాణి ఉందని అతడు నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడకుండా సోషల్ మీడియా ద్వారా అందరినీ తప్పుదోవ పట్టించి తన మొబైల్, బైక్‌ను బీచుపల్లి కృష్ణానది బ్రిడ్జిపై వదిలేసి ముంబాయికి వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వ్యక్తి బతికే ఉన్నాడా లేక ఎటైనా పోయాడా అనేది తేలాల్సి ఉంది.
రెండో రోజు కొనసాగిన
గాలింపు చర్యలు


