ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకోవాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవాల్సి వస్తదని.. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిని తరలించుకుపోయే ప్రమాదముందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జిల్లావాసిగా సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసమానతలు తొలగించే ఉద్దేశంతో అవకాశం, అధికారం, ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణ జాగృతి ముందుకెళ్తుందని చెప్పారు. తెలంగాణ వచ్చా క ఏర్పాటు చేసుకున్న ఆస్పత్రులు, గురుకులాలను నడపలేని స్థితిలో ప్రభు త్వం ఉండటం పాలకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎ న్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో షాడో కేబినెట్ ఏర్పాటుచేసి.. మంత్రుల పనితీరుపై నిఘా పెడతామన్నారు. తనకు బీఆర్‌ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి పోలేపల్లి సెజ్‌పై ఉన్న ఆసక్తి.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదన్నారు. పీఆర్ స్టంట్‌ల కోసం ఆసక్తి చూపుతారని ఆరోపించారు. ఎమ్మెల్యే యెన్నం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా.. బీజేపీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు.


