పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలి: కలెక్టర్
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులు నాణ్యతా ప్రమాణాలతో తెచ్చిన మొక్కజొన్న, పత్తిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ సాగించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మక్కలు ఎండబెట్టుకొని శుభ్రంగా తీసుకొస్తే ప్రభుత్వ మద్దతు ధర పొందవచ్చని రైతులకు సూచించారు. అనంతరం అప్పా యిపల్లి శివారులో కాటన్ జిన్నింగ్ మిల్లును ఆమె సందర్శించారు. పత్తి రైతులతో కలెక్టర్ మట్లాడుతూ.. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకువస్తే సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు తెచ్చిన పత్తిని తేమ శాతాన్ని ఒకటికి నాలుగుసార్లు పరిశీలించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేయాలన్నారు. మోంథా తుపా న్ కారణంగా బుధ, గురువారాలలో వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు తమ సరుకులను అరబెట్టుకొని తీసుకు రావాలని, లేకుంటే మద్దతు ధర లభించద ని సూచించారు. మార్కెటింగ్ శాఖ ఏడీ బాలమణి, మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి ఉన్నారు.


