
వీకేర్ సీడ్స్‌లో పూర్తయిన ఐటీ సోదాలు
ఉండవెల్లి: మండలంలోని జాతీ య రహదారి పక్కన ఉన్న వీకేర్ సీడ్స్ ప్రైవేట్ కంపెనీలో మంగళవారం తెల్లవారుజాము నుంచి శనివారం వరకు ఆంధ్ర, తెలంగాణాకు చెందిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగులను ఇళ్ల నుంచి తీసుకొచ్చి మరీ డాక్యుమెంట్లు, పత్రాలు, కంప్యూటర్లు, లాకర్లు, బీర్వాలు పరిశీలించారు. చివరకు ఎలాంటివి పట్టుబడలేదని శనివారం తెల్లవారుజామున వెళ్లిపోయారు. గురువారం యాజమాన్యంలో భాగమైన కిరణ్ కుమా రుడిని శుక్రవారం ఇద్దరు యజమానులు దూడెంపూడి కిరణ్‌కుమార్, ధూళిపాల వెంకట్రావును విచారించారు. మిగిలిన ఇద్దరు ధూళిపాల కోటిస్వామి, బాబాయ్య హాజరుకాలేదని సమాచారం. కాగా రైతులు వీకేర్‌కు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధాన్యాన్ని శనివారం తరలించడం ప్రారంభించారు.