
18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఖిల్లాఘనపురం: మండల పరిధిలోని సోళీపురం గ్రామ సమీ పంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యా న్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. పూర్తి వివరాలు.. శనివారం సా యంత్రం సమయంలో ఖిల్లాఘనపురం పోలీసులు గస్తీలో భాగంగా సోళీపురం మీదుగా వెళ్తుండగా ఊర్కొండ మండలం రేవల్లికి చెందిన గొడుగు కృష్ణ 40 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సుమారు 18 క్వింటాళ్ల బియ్యం, డ్రైవర్ కృష్ణను స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
ధన్వాడ: మండలంలోని యంనోనిపల్లిలో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కర్ణాటకు తరలిస్తున్న వాహనాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. నర్వ మండలంలో పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యం సేకరిస్తున్న బొలెరో వాహన డ్రైవర్ నరేందర్, యజమాని బాలరాజుపై కేసు నమోదు చేసి డీటీ పంచానామా నిర్వహించిన్నట్లు ఇన్‌చార్జ్ ఎస్‌ఐ సురేష్ పేర్కొన్నారు.
జాతీయ రహదారిపై ఆరు కార్లు ఢీ
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారుకు ఉత్తర ఫీడ్స్ వద్ద కుక్క అడ్డురాగా.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనక ఉన్న మొత్తం 6 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలోని కార్లు జాతీయ రహదారిపై ఢీకొనడంతో వాహనాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అప్పటికే కార్లు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత