
ఫైనల్లో పాలమూరు– పేట
● ఉత్సాహంగా సాగుతున్న నెట్‌బాల్ టోర్నీ
● బాలికల ట్రెడిషనల్ ఫైనల్లో రంగారెడ్డి, నల్లగొండ
● ప్రారంభమైన ఫాస్ట్–5 పోటీలు
● నేడు ముగియనున్న జూనియర్
చాంపియన్‌షిప్
బాలుర విభాగం మహబూబ్‌నగర్–ఖమ్మం జట్ల సెమీఫైనల్ మ్యాచ్
నాగర్‌కర్నూల్–ఆదిలాబాద్ జట్ల మధ్య బాలికల మ్యాచ్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్ నెట్‌బాల్ చాంపియప్‌షిప్ ఉత్సాహంగా జరుగుతోంది. ట్రెడిషనల్ విభాగం పోటీలు ఉత్కంఠంగా సాగాయి. ఈ విభాగంలో అతిథ్య మహబూబ్‌నగర్ బాలుర జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తుది సమరానికి చేరుకుంది. ఫైనల్లో నారాయణపేట జిల్లా జట్టుతో తలపడనుంది. ఇక బాలికల్లో రంగారెడ్డి, నల్లగొండ జట్లు ఫైనల్‌కు చేరాయి. బాలుర విభాగం మూడో స్థానంలో ఖమ్మం, జనగాం జట్టు, బాలికల విభాగంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్ జట్లు సంయుక్తంగా నిలిచాయి. నేడు ఈ మెగా టోర్నీ ముగియనుంది.
సెమీఫైనల్ ఫలితాలు: బాలుర మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ బాలుర జట్టు 16–11 పాయింట్ల తేడాతో ఖమ్మం జట్టుపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో నారాయణపేట జట్టు 18–12 తేడాతో జనగాం జట్టుపై గెలిచింది. బాలికల విభాగం సెమీఫైనల్ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు 11–6 పాయింట్ల తేడాతో నిజామాబాద్ జట్టుపై, నల్గోండ జట్టు 15–11 తేడాతో మహబూబ్‌నగర్ జట్టుపై గెలుపొందాయి.
క్వార్టర్ ఫలితాలు: బాలుర విభాగం క్వార్టర్‌ఫైనల్ మ్యాచుల్లో ఖమ్మం జట్టు 21–11 పాయింట్ల తేడాతో నల్లగొండ జట్టుపై, నారాయణపేట జట్టు 23–7 తేడాతో హైదరాబాద్‌పై, మహబూబ్‌నగర్ జట్టు 18–02 తేడాతో గద్వాల జట్టుపై, జనగాం జట్టు 14–12 తేడాతో నాగర్‌కర్నూల్ జట్టుపై విజయం సాధించాయి. బాలికల విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో రంగారెడ్డి జట్టు 12–5 పాయింట్ల తేడాతో మేడ్చల్ జట్టుపై, నల్లగొండ జట్టు 16–4 తేడాతో ఖమ్మంపై, నిజామాబాద్ 19–14 తేడాతో కొమురంభీమ్ ఆసిఫాబాద్‌పై, మహబూబ్‌నగర్ జట్టు 13–3 తేడాతో నాగర్‌కర్నూల్ జట్టుపై గెలుపొందాయి.
ఫాస్ట్–5 పోటీలు ప్రారంభం
శనివారం బాలబాలికల విభాగం ఫాస్ట్–5 పోటీలు ప్రారంభమయ్యాయి. బాలుర విభాగం నాకౌట్ మ్యాచుల్లో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జట్టు 22–13 తేడాతో మెదక్ జట్టుపై, కరీంనగర్ జట్టు 22–10 తేడాతో కొత్తగూడెంపై, వనపర్తి జట్టు 10–3 తేడాతో వరంగల్‌పై, మేడ్చల్ జట్టు 11–3 తేడాతో రంగారెడ్డిపై, హైదరాబాద్ జట్టు 34–6 తేడాతో నిర్మల్‌పై విజయం సాధించాయి. బాలికల విభాగంలో జగిత్యాల జట్టు 10–4 తేడాతో జనగాంపై, మహబూబ్‌నగర్ 16–4 తేడాతో మహబూబాబాద్‌పై, కామారెడ్డి జట్టు 7–3 తేడాతో వికారాబాద్‌పై, నాగర్‌కర్నూల్ 14–4 తేడాతో మంచిర్యాలపై, ఖమ్మం జట్టు 11–4 తేడాతో కొమురంభీమ్ ఆసిఫాబాద్‌పై గెలుపొందాయి. అంతకుముందు ఫాస్ట్–5 మ్యాచ్ జట్లను నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి శిరీషారాణి పరిచయం చేసుకున్నారు. టోర్నీలో ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

ఫైనల్లో పాలమూరు– పేట