
విపత్తులపై మాక్ డ్రిల్
తుంగభద్రలో..
మాక్‌డ్రిల్‌ను వీక్షిస్తున్న ప్రజలు, విద్యార్థులు
అలంపూర్ వద్ద తుంగభద్ర నదిలో ప్రత్యేక బోట్లతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల మాక్‌డ్రిల్
ప్రకృతి విపత్తలుపై ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్తులు ఎదురైన సమయాల్లో ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించారు. అలంపూర్‌లోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం సముదాయంలో ఉన్న తుంగభద్ర నదిపై గురువారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసుల సహకారంతో స్థానిక ప్రజలకు, విద్యార్థులకు విపత్తలపై అవగాహన కల్పించారు. ఎన్‌డీఆఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తుంగభద్ర పుష్కరఘాట్ వద్ద తుంగభద్ర నదిలో ప్రత్యేక బోట్ల సహాయంతో మాక్‌డ్రిల్ నిర్వహించారు. వరద నీటిలో ప్రాణాలు ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. లోతైన నీటి ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ ద్వారా రెస్క్యూ టీం పని విధానాన్ని వివరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ విపత్తులు సంభవించిన సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో ఎస్‌డీఆర్‌ఎఫ్ కూడా పనిచేస్తున్నట్లు చెప్పారు. భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు. నది తీర ప్రాంతంలో ప్రాణనష్టం జరగకుండా ఆలయ, రెవెన్యూ సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.
– అలంపూర్

విపత్తులపై మాక్ డ్రిల్

విపత్తులపై మాక్ డ్రిల్