
వీకేర్ సీడ్స్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
మరికల్: రాయిచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తు న్న కర్ణాటక బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం రాయిచూర్ నుంచి వచ్చిన కర్ణాటక బస్సు ఎమ్మోనోనిపల్లి, ఎలిగండ్ల శివారు సమీపంలో జాతీయ రహదారిపైకి రాగానే ఎదురు గా వచ్చిన పశువులను తప్పించబోయి బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 50కి పైగా ప్రమాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఉపిరి పిల్చుకున్నారు. అనంతరం ప్రొక్లెయిన్ సాయంతో బస్సును రోడ్డుపైకి లాగడంతో తిరిగి ప్రయాణికులతో హైదరాబాద్‌కు తరలివెళ్లింది.
చింతరేవులలో
మొసలి కలకలం
ధరూరు: మండలంలోని చింతరేవుల గ్రామ శివారులోని గాదె చెరువులో గురువారం ఓ మొసలి ప్రత్యక్షం అయ్యింది. గ్రామానికి చెందిన రైతు గోవిందుకు చెందిన మేకలు మేత కోసం చెరువు పక్కన తీసుకు వెళ్లగా చెరువులోంచి ఓ మోసలి వచ్చి మేత మేస్తున్న ఓ మేకను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టు పక్కల రైతులు గమనించి మేకను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చెరువులో మొసలి సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.