
కీళ్ల ఆరోగ్యంతో మెరుగైన జీవన ప్రమాణం
పాలమూరు: కీళ్ల ఆరోగ్యంతోనే మనిషి జీవణ ప్రమాణ కాలం పెరుగుతుందని ఎస్‌వీఎస్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ కేజేరెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా కోట్ల మంది నీ–జాయింట్(మోకాళ్ల నొప్పులు) సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న ప్రపంచ అర్థరైటీస్ డే సందర్భంగా ఉదయం 7 గంటలకు ఎస్‌వీఎస్ ఆధ్వర్యంలో వాకథాన్ ర్యాలీ పట్టణంలోని పద్మావతి కాలనీ కమాన్ నుంచి ఎస్‌వీఎస్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎస్‌వీఎస్‌లో తెలంగాణ ఆర్థో సర్జన్స్ అసోసియేషన్(టీవోఎస్‌ఏ) 400 నుంచి 450 మంది ప్రతినిధులతో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా రివిజన్ సర్జరీలపై చర్చ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌వీఎస్ రెసిడెంట్ డైరెక్టర్ రాంరెడ్డి, వైద్యులు కె.ఎల్ జగదీశ్వర్‌రావు, ఆంజనేయులు, రవితేజ, శ్రీధర్‌రెడ్డి, జయరాంరెడ్డి, దివ్య, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.