
కేసీఆర్‌కు పదిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: జూపల్లి
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఇప్పుడు సంవత్సవానికి రూ.75 వేల కోట్ల అప్పు కడుతున్నామని తెలిపారు. ఆనాటి ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు ఏడుసార్లు టెండర్లు వేస్తే ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదని చెప్పారు. ఒక్క ఇంటికి మరో రూ.లక్ష పెంచమని కేసీఆర్‌ను పదిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు కుటుంబ పాలనతో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని చెప్పారు.
అప్పుల్లో ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం: వాకిటి
నల్లమల ముద్దుబిడ్డ రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసుకుని బాగు పడదామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైనా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేస్తామనే సంకల్పంతో సీఎం ఉన్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌కు పదిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: జూపల్లి