
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 11వ రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–13) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు సంబంధించి 225 క్యాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు గురువారం ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్లో ప్రతిభ కనబరిచిన వారు శుక్రవారం నుంచి జరిగే మెయిన్ డ్రాకు అర్హత సాధించారు.
శుక్రవారం ఉదయం ప్రారంభోత్సవం...
రాష్ట్రస్థాయి అండర్–13 బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, రవికుమార్ తెలిపారు. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న క్యాలిఫైయింగ్ మ్యాచ్‌లను వారు పరిశీలించారు. నాలుగు సింథటిక్ కోర్టుల్లో సింగిల్, డబుల్స్ పోటీలు జరుగుతాయని, ఈ నెల 7న చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకుడు సుధాకర్, రెఫరీ కిషోర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు నాగరాజుగౌడ్, విజయ్‌రెడ్డి, ఎంపీ.ప్రవీణ్, సభ్యులు శశాంక్ పాల్గొన్నారు.
క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు పూర్తి
నేటి నుంచి మెయిన్ డ్రా పోటీలు
ప్రేక్షకులతో కిటకిటలాడిన
ఇండోర్ స్టేడియం