
డైవర్షన్ పనులుపక్కాగా చేపట్టాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: చిన్నదర్పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణలో ఫారెస్ట్ డైవర్షన్ పనులు పక్కాగా చేపట్టాలని కేంద్ర అటవీశాఖ డీజీ చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని చిన్నదర్పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో జాతీయ రహదారి విస్తరణలో కోల్పోతున్న అటవీ భూమి, చెట్లను ఆయన పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నష్టానికి సంబంధించి ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా డైవర్షన్ పనులు పక్కాగా చేపట్టాలని డీఎఫ్‌ఓ సత్యనారాయణకు సూచించారు. విస్తరణలో పోతున్న అటవీ భూమికి బదులుగా మరోచోట ఇవ్వడం, చెట్లకు బదులుగా మరోచోట నాటడం వంటి పనుల్లో ఎలాంటి జాప్యం జరగరాదని సూచించారు. అనంతరం మహబూబ్‌నగర్ సమీపంలోని దొడ్డలోనిపల్లి ఫారెస్ట్ బీట్ పరిధి ప్లాంటేషన్, మయూరీ పార్క్‌ను సందర్శించారు. పార్క్‌లో ఏర్పాట్లు, మొక్కలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి అబ్దుల్‌హాయ్, జాతీయ రహదారి ఈఈ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర అటవీశాఖ డీజీ చంద్రశేఖర్

డైవర్షన్ పనులుపక్కాగా చేపట్టాలి