Telagnana Crime News: యువకుడు అదుపుతప్పి జూరాల కాల్వలో.. తీవ్ర విషాదం!
Sakshi News home page

యువకుడు అదుపుతప్పి జూరాల కాల్వలో.. తీవ్ర విషాదం!

Sep 10 2023 12:36 AM | Updated on Sep 10 2023 9:12 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: స్నేహితులతో కలిసి శుభకార్యానికి వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రాము కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన మోహన్‌ (18) మానవపాడులో పెళ్లికి శుక్రవారం వచ్చాడు. వ్యక్తిగత పని నిమిత్తం తెలిసిన వారి ద్విచక్ర వాహనం తీసుకొని అదేరోజు రాత్రి 44వ నంబర్‌ జాతీయ రహదారి వైపు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి జూరాల కాల్వలో పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

శనివారం ఉదయం వెదకగా కాల్వలో మృతదేహం, బైక్‌ కనిపించింది. మోహన్‌ కర్నూలులోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహానికి అలంపూర్‌ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement